ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని చింతలపల్లి, రౌతు పల్లి, ఎడమకల్లు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మరియు రెవెన్యూ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమరోలు మండలంలో రైతుల కొరకు ఎటువంటి యూరియా కొరత లేదని అధికారులు రైతులకు తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో పాటు ప్రైవేటు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన ప్రైవేటు దుకాణాలను కూడా యూరియా దొరుకుతుందని తెలిపారు. ఎవరన్నా యూరియా లేదని చెబితే వెంటనే రైతులు తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.