టాటా ఏసీ వాహనం కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం 7:30 ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు బంగారుపాళ్యం మండలంలోని మొగిలి జంక్షన్ వద్ద టాటా ఏసీ వాహనం మొగిలి గ్రామం లోపలికి వెళ్లేందుకు డ్రైవర్ జాగ్రత్తగా చూడకుండా రోడ్డు క్రాస్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో టాటా ఏసీ బోల్తా పడింది. డ్రైవర్ కు గోకుడు గాయాలయ్యాయి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది