అవుకు మండలం శివవరం, సింగన పల్లె గ్రామలలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి.శివవరం గ్రామంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరి, మొక్కజొన్న, మిరప పంటలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.