ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని దస్తురాబాద్ తహశీల్దార్ విశ్వంబర్ తెలిపారు. గురువారం దస్తూరాబాద్ మండలకేంద్రంలో మండలంలోని రేవోజిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు అటవీ భూముల్లో ఇళ్లను నిర్మించవద్దని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అలాగే నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్న అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, ఎంపీఓ రమేష్ రెడ్డి, ఏఈ వంశీ తదితరులు పాల్గొన్నారు.