తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దు కావడంతో 60 మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు వచ్చి, 8.45 కు వెళ్లాల్సిన సర్వీస్ ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు స్పైస్ జెట్ మేనేజర్, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై F2 నటుడు ప్రదీప్ మచ్చెర్ల మండిపడ్డారు.