పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల వేంపల్లి చక్రాయపేట వేముల తదితర మండలాలలో శుక్రవారం గణేష్ విగ్రహాల నిమజ్జనం గణేష్ మండపాల నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఉన్న వినాయక విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేసి పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు చేసి అనంతరం విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రవేశించారు ఈ సందర్భంగా భక్తుల కోలాటం నృత్యాల నడుమ నిమజ్జన కార్యక్రమం ఘనంగా ముగిసింది.