పల్నాడు జిల్లా,సత్తెనపల్లిలో తప్పుడు సోషల్ మీడియా పోస్టులపై సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు.శుక్రవారం రాత్రి 8గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం జరిగిన నిరసన ఫోటోను వాడుతూ, 'డీఎస్పీ రైతు పీక తొక్కుతున్నారు' అంటూ 'దేవుడు@ చిన్న మాతంగి' అనే సోషల్ మీడియా ఖాతాలో అవాస్తవ పోస్ట్ పెట్టారని ఆయన తెలిపారు. ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.