వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామ చెందిన స్వాతిని మహేందర్ రెడ్డి కుటుంబం అంతా కలిసి పక్క ప్రణాళికతోనే అతి దారుణంగా హత్య చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి గూడ గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రేమించి పెళ్లి చేసుకున్న బీసీ బిడ్డ స్వాతిని మహేందర్ రెడ్డి అతిదారణంగా హత్య చేయడం దారుణమని, హత్య జరిగె ముందు రోజే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ ఎక్కడికో ముందుగానే వెళ్లడం హత్యకే మనస్సు తప్పుదోవ పట్టించే విధంగా రెడ్డి పోలీసులు చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని అరెస్టు చేయాలన్నారు.