కర్నాటక రాష్ట్రం సండూరు తాలుకా లక్కలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మప్ప అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో తన కుమార్తె ను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఈనెల 22 న రాయదుర్గం బస్సు ఎక్కాడు. అయితే రాయదుర్గం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకి తెలిస్తే 9494542692 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.