సీఎం చంద్రబాబు చిరకాల స్వప్నం నెరవేరింది. కుప్పంకు హంద్రీనీవా జలాలను తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటి కష్టాలు తీర్చి సస్యశ్యామలం చేస్తామంటూ రెండు దశాబ్దాలకు పైగా ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ జలాలు కుప్పం చేరుకోవడంతో చంద్రబాబు చిరకాల స్వప్నం నెరవేరింది. రేపు కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేయనున్నారు.