బుధవారం రాత్రి 10:30 నిమిషాల నుండి 11:30 నిమిషాల వరకు గుంటూరు నగర వ్యాప్తంగా 08 ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిరోధమే లక్ష్యంగా ఆకస్మిక వాహనాల తనిఖీ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వాహనాల తనిఖీలలో వాహనాల అస్తవ్యస్త పార్కింగ్, మైనర్ డ్రైవింగ్/ రాష్ డ్రైవింగ్/ బైక్ రేసింగ్, ట్రిబుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో ఏడుగురు డిఎస్పీలు, 12 మంది సిఐలు, 16 మంది ఎస్సైలు మరియు 120 మంది పోలీస్ సిబ్బంది మొత్తం 155 మంది పాల్గొన్నారు