పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్టులోని 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగుకు మంగళవారం సాయంత్రం 5:00 సమయంలో నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,88,848 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,75,492 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585.85 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.