కర్నూలు నగరంలో జూలై 11, 12 తేదీలలో జరుగుతున్న డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, గురువారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎం వుచ్చిరప్ప పిలుపునిచ్చారు. ఆదోని సిఐటియు కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆదోని మండలం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు..రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డివైఎఫ్ఐ సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి తెలిపారు.