వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్సీఐ కాలనిలో సోమవారం మధ్యాహ్నం మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన పక్కనే డ్రైనేజీ పొంగి రోడ్డు మీద నీరు నిలుస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు మంజూరు అయ్యాయని అతి త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే పెద్దగా పెరిగే మొక్కలు కాకుండా చూడడానికి ఆకర్షనీయంగా ఉండే మొక్కలను మాత్రమే నాటాలని ఆయన తెలిపారు.