అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థిని విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి మరియు క్రమశిక్షణ అలవడేలా పైలెట్ ప్రాజెక్టుగా 8 సంక్షేమ వసతి గృహాల్లో విపశ్యన యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం సమనస మహాత్మ జ్యోతిరావు పూలే ఆంధ్ర ప్రదేశ్ బీసీ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో విపశ్యన యోగ సాధన పట్ల పొందుతున్న ఆసక్తిని క్రమశిక్షణ ను గూర్చి ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.