అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇల్లు ముట్టడికి తరలి వెళుతున్న 95 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ముందస్తు అరెస్టు చేశామని పామిడి సీఐ యుగంధర్ చెప్పారు. పామిడి హైవేలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి వెళుతున్న అభిమానులను కట్టడి చేసి అరెస్టు చేశామన్నారు.గుత్తి,పామిడి, పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లకు అరెస్టు చేసిన వారిని తరలించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.