అనుమానాస్పద స్థితిలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలకపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు నాగర్కర్నూల్ ఎస్సై గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన భాష మౌని వెంకటయ్య గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వచ్చాడని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రవీంద్ర టాకీస్ చౌరస్తా వద్ద మృతి చెంది ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు తెలిపారు.