నల్గొండ జిల్లా: కాలేశ్వరం ప్రాజెక్టు ఈ కార్ రేసు ధరణిలో దోచుకున్న సొమ్మునంత కక్కించి పేదలకు అందిస్తామని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం అన్నారు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రంలో మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అరెస్టు అవుతున్నారని ఇక్కడ అరెస్టులు లేవన్నారు. బిఆర్ఎస్ రాష్ట్రాన్ని పూర్తిగా ఖూనీ చేసిందని ఆరోపించారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని చట్టప్రకరమే అన్ని జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.