నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా సోమవారం రైతులు సూర్య కోసం ఉదయం నుంచే బారులు తీరారు. యూరియా నిలువలు తక్కువగా ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పంటలకు కీలకమైన యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు