ప్రకాశం జిల్లా లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ను మంగళవారం ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ కాంప్లెక్స్ లో వ్యాపారులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు కు ముఖ్య అతిధులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఉడా చైర్మన్ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ హాజరై కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు పథకాలను అమలు చేశామని, త్వరలోనే మిగిలిన పథకాలను కూడా అమలు చేయటం జరుగుతుందని తెలిపారు. ఇబ్బందులు ఎన్ని ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపా