విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుందని అబద్ధపు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులను నమ్మవద్దని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు మంగళవారం తన నివాసంలో విశాఖ పార్ల మెంట్ కూటమి ఎమ్మెల్యే లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన “విశాఖ ప్రజల గర్వకారణమైన స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకు రావడమే మా లక్ష్యం ప్రైవేటీ కరణ అసలు కాదు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.*స్టీల్ ప్లాంట్‌పై స్పష్టమైన హామీ*ప్రస్తుతం ఉక్కు కర్మాగారం లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తి సామర్థ్యంతో నడుస్తు న్నాయని, కాస్ట్ తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ వెల్లడించారు.