NCC ఎంపికలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న బీటెక్ విద్యార్థి పాలవలస సాయికిరణ్ (19) అస్వస్థతకు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మృతుడు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన వాడు. సాయికిరణ్ మరణంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.