సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే మాణిక్ రావు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పోలీసు, ఆర్ అండ్ బి, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి కొత్తూరు నారింజ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విగ్రహాలు నారింజకు నిమజ్జరానికి రానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.