పామర్రులో విష జ్వరాలపై వైద్య నిపుణుల సూచనలు స్తానిక పామర్రు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పిల్లల వైద్య నిపుణుడు సుదేశ్ బాబు విష జ్వరాలపై సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సూచనలు ఇచ్చారు. ఈ జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పామర్రు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా పిల్లలు, పెద్దల్లో కూడా జ్వరాలు వస్తున్నాయని, కాబట్టి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గోరువెచ్చని నీటిని తాగాలని, మాస్కులు ధరించడం శ్రేయస్కరమన్నారు.