ఆదివారం మధ్యాహ్నం విజయవాడ వాంబే కాలనీకి చెందిన కొంతమంది యువకులు జిల్లాలోని తాడేపల్లి పరిధిలోగల పోల్కంపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈతకు దిగినట్లు తాడేపల్లి ఎస్సై ఖాజావలి తెలిపారు. ఈతకు దిగిన యువకుల్లో జంపన భవాని శంకర్ అనే యువకుడు గల్లంతు అయినట్లు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీసేందుకు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆదివారం రాత్రి తాడేపల్లి ఎస్సై ఖాజావలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.