Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
పెదబయలు మండలంలోని గుల్లేలు జంక్షన్ నుంచి సంగంవలస వరకు 3 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన తారురోడ్డు ధ్వంసమై శిథిలావస్థకు చేరి కంకరరాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో నాలుగు పంచాయతీల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి 100 మీటర్ల సిసి రోడ్డుతోపాటు తారురోడ్డు నిర్మించి గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.