నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జననాధునికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ బుధవారం ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి ,సిఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.