పార్వతి పరమాన్నం జిల్లా, కొమరాడ మండలంలోని గాంధీనగర్ వద్ద గల అంతర్రాష్ట్ర రహదారిలో ఉన్న గోతిలో పడి శుక్రవారం రాత్రి బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. కొమరాడ మండలం, ఉలిపిరి పంచాయతీ అల్లవాడ గ్రామానికి చెందిన భాస్కరరావు అనే వ్యక్తి కూనేరు గ్రామం నుండి తన గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తొలుత రామభద్రపురం పి హెచ్ సి కి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.