శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వినాయక చవితి సందర్భంగా చెక్కభజన కార్యక్రమంలో రెండు తులాల బంగారు గొలుసు పోగొట్టుకున్న గణేష్కు మంగళవారం మధ్యాహ్నం ఆ చైన్ను అందజేశారు. వరంగల్కు చెందిన సత్యసాయి భక్తుడు కేశవ చంద్ర దొరికిన గొలుసును వినాయక కమిటీకి అప్పగించగా, వారు నిజమైన యజమాని గణేష్కు అప్పగించారు. కేశవ చంద్రను కమిటీ శాలువాతో సన్మానించి సత్యసాయి చిత్రపటాన్ని బహూకరించి అతని నిజాయితీని అభినందించారు.