Download Now Banner

This browser does not support the video element.

ములుగు: జిల్లా కేంద్రంలో కలెక్టర్ దివాకర టిఎస్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ రైతు సంఘం నాయకులు

Mulug, Mulugu | Sep 11, 2025
ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టిఎస్ కు నేడు గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ జిల్లాలో యూరియా సమస్యతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఇప్పటికే కొంతమంది రైతులకు యూరియా వేయడంలో ఆలస్యం కారణంగా పంట ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉందని, రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో భారీగా నష్టపోతారని, పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us