విద్యార్థులంతా కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జుమ్మేరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు అదనపు కలెక్టర్, అధికారులకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు.