ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రెండు కాళ్ళను ఢీ కొట్టిన ఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపే వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కింగ్ ట్రావెల్స్ బస్సు స్టేషన్ మాసాయిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి అదుపుతప్పి ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.