కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన యువకుడు పెన్నా నదిలో ఈతకు వెళ్లి శనివారం గల్లంతయిన విషయం తెలిసిందే.యువకుడి కోసం పోలీస్ శాఖ, ఫైర్ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టిన తర్వాత ఆదివారం యువకుడి మృతదేహం లభ్యం అయింది. మైలవరం ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి వివరాల మేరకు యువకుడు వేపరాల గ్రామానికి చెందిన చిమ్మని వెంకటరమణ (32) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.