ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరుగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుంది. దీంతో పుష్కర ఘాట్ వద్ద బుధవారం రాత్రి 12 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.