రాయదుర్గం పట్టణంలో ఎయిర్ టెల్ నెట్ వర్క్ స్థంభించింది. శనివారం సాయంత్రం నుంచి ఎయిర్ టెల్ సిమ్ ఉన్న ఫోన్లు కాల్స్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ రాకపోవడంతోపాటు ఇంటర్ నెట్ పూర్తి గా ఆగిపోయింది. ఆ కంపెనీ కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో నెట్ వర్క్ కేబుల్ ఫెయిల్ అయినట్లు గుర్తించి మరమత్తు పనులు చేపట్టారు. ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా చెప్పేవారు లేక నానా అవస్థలు పడుతున్నారు.