నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ కి రౌడీషీటర్లు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ గా మారిన వెంటనే పోలీసులు స్పందించారు. వీడియోలో 8 మందిని గుర్తించి వారిలో ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కేసు కు సంబంధించిన వివరాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో మాట్లాడారా.. లేక కోటంరెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తరువాత నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి