కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద వినాయక మండపంలో ప్రత్యేక పూజ కార్యక్రమల్లో శుక్రవారం సాయంత్రం 7గంటలకు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్. టవర్ సర్కిల్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. యువకులు, చిన్నారులతో టవర్ సర్కిల్ కోలాహలంగా మారింది. సంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో టవర్ సర్కిల్ సందడిగా మారింది. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా పూజలు అందుకున్న వినాయకుడు ఈరోజు కరీంనగర్ లో నిమజ్జన ఉత్సవాలకు సిద్ధమయ్యారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.