కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సరైన చికిత్సలు చేయించుకోవాలని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 4వ వార్డు నరసయ్య అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని త్రిమూర్తులు ఆదివారం మధ్యాహ్నం 2:30కు గంటలకు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.