కేంద్ర ప్రబుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం రద్దు చేసిన టాక్స్ ను ఉపసంవరన చేసి రైతులను ఆదుకోవాలని ఖానాపూర్ మండల కేంద్రంలో రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుదవారం ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘాల నాయకులు. నిరసన తెలిపి తహసీల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగ వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం సుంకన్ని ఉపసంవరించుకోవలని,MSP గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని,పత్తి రైతుకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.