నగరంలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలకు సంబంధించి ఉన్న మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఎలాంటి ఉదాసీనతను సహించబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పన్ను వసూళ్లపై రెవెన్యూ, ఇంజనీరింగ్, నోడల్ అధికారులు, అడ్మిన్, అమినిటీస్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.93 కోట్లు ఉన్నాయని, అందులో టాప్-100 బకాయిదారుల నుండి రూ.12.76 కోట్లు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. తాగునీటి కొళాయి చార్జీల బకాయిలు మొత్తం రూ.21 కోట్లు ఉండగా, టాప