బేస్తవారిపేటలో దారుణ హత్యకు గురైన కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త బ్రహ్మయ్య కుటుంబాన్ని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు పరామర్శించారు. వైసిపి కార్యకర్త బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కంభం వచ్చారు. బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు బ్రహ్మయ్య మృతదేహాన్ని పరిశీలించారు. కార్యకర్త మృతిపై శివప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బ్రహ్మయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.