జగ్గంపేట మండలంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ A.E వీరభద్ర రావు బుధవారం తెలిపారు. 11KV నరేంద్ర పట్నం ఫీడర్ నందు ROSS వర్క్ కారణంగా గొల్లలగుంట, గుర్రంపాలెం, బావారం, కాండ్రేగుల గ్రామాలకు, బోరులకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.