ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ విమల సరోజిని కుమారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన బడుగువానిలంకకు చెందిన సుబ్రహ్మణ్యం నుంచి ఆమె రూ.28 వేలు డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని తన కారు డ్రైవర్ దుర్గాప్రసాద్ కు ఇవ్వాలని కోరారు. బాధితుడి ఫిర్యాదుతో డీఎస్పీ కిషోర్ కుమార్ వారిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించనున్నట్లు తెలిపారు.