పత్తికొండలో రేపు జరిగే 'అన్నదాత పోరుబాట' కార్యక్రమానికి వేలాది మంది తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పిలుపునిచ్చారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిరసనగా, ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాటు ధర కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారని సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్ష హాజరవుతారని చెప్పారు.