తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వైరాలో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది.ఇంటిని వరద నీరు ముంచెత్తినప్పటికీ దిక్కుతోచని స్థితిలో వరద, మురుగునీరులోనే ఆమె జీవనం కొనసాగిస్తుంది. ఈ హృదయ విదారక సంఘటన చూసిన స్థానికులు అయ్యో..పాపం అంటూ తమ జాలిని చూపిస్తున్నారు.కానీ వృద్ధురాలి ఇంటిని వరద నీరు చుట్టుముట్టినా కనీసం పట్టించుకునే అధికారులు కరువయ్యారు.వైరాలోని బ్రాహ్మణపల్లిలో పేర్ల చావడి పక్కన ఉన్న షేక్ సైదాబీ రేకుల ఇల్లు మొత్తాన్ని వరద నీరు చుట్టూ ముట్టి ముంచెత్తుతోంది. సైదాబీకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.