నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలోని న్యాయవాది వెంకటయ్య పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున న్యాయవాదులు నినాదాలు చేశారు.ఈ నిరసనతో కోర్టు కార్యకలాపాలు స్తంభించాయి.