నిర్మల్ పట్టణ కేంద్రంలో బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం జిల్లా అధ్యక్షులు రత్నం మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ విప్లవానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దొరల అనుచరులను తరిమి కొట్టి ప్రజలలో చైతన్యం నింపాలని పేర్కొన్నారు. ఇందులో జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు ఉన్నారు.