శ్రీ కాళోజి నారాయణరావు 111 వ జయంతి వేడుకలను మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆయన తెలుగు సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, ప్రజాసేవలో చేసిన కృషిని స్మరించుకున్నారు.