ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టులోకి 5,100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం అప్రమత్తమయ్యారు. 4 గేట్ల ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు వాగు వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.