Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సబ్ కలెక్టర్ డా.ఆర్ వైశాలి అన్నారు. వినాయక చవితి పండగ నిర్వహణ, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏ ఎస్ పి అంకితా సురానా తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మండపాలు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. డి జె సౌండ్ ఉండరాదని ఆమె అన్నారు. మండపాల్లో విద్యుత్ సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యుత్ షాక్ కు గురికావడం వంటి సంఘటనలు తలెత్తరాదని ఆమె స్పష్టం చేశారు.